GST on Cryptos | క్రిప్టో ఇన్వెస్టర్లకు తడిసిపోద్ది.. 30శాతం ఐటీకి జీఎస్టీ అదనం!
GST on Cryptos | క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టినా.. ట్రేడింగ్ చేసినా జేబు గుల్ల కావడం ఖాయమే. 30% ఐటీతోపాటు 28% జీఎస్టీ విధించనున్నారు.
GST on Cryptos | దేశంలో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే వారికి గట్టి షాక్ తగులబోతున్నది. ఆదాయం పన్నుతోపాటు ట్రేడింగ్‌లో పాల్గొంటే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. బిట్ కాయిన్‌తోపాటు క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్‌పై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ సిద్ధం అవుతున్నది. క్యాషినోస్, బెట్టింగ్, లాటరీల నిర్వహణతోపాటు క్రిప్టోల ట్రేడింగ్‌పై 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నది.
క్రిప్టో కరెన్సీ మైనింగ్‌తోపాటు క్రయ విక్రయాలపైనా 28 శాతం జీఎస్టీ అమల్లోకి రానున్నది. అయితే వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే అమల్లోకి వస్తుందని మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే, ఇంకా జీఎస్టీ కౌన్సిల్ తేదీ ఖరారు కాలేదు.
క్రిప్టో కరెన్సీల బదిలీ ద్వారా వచ్చే లాభాలపై ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ 30 శాతం పన్ను విధించింది. గిఫ్ట్‌లతోపాటు ఒక శాతం టీడీఎస్తోపాటు క్రిప్టో లావాదేవీలపై మొత్తం 30 శాతం పన్ను విధిస్తామని గత ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రిప్టోలపై ఆదాయం పన్ను వసూలు చేయడానికి 1961 ఆదాయం పన్ను చట్టంలో డిజిటల్ అసెట్స్‌ను చేరుస్తూ అదనంగా 115బీబీహెచ్ సెక్షన్ జత చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

