GST Council | గుర్రప్పందాలు.. ఆన్ లైన్ గేమింగ్స్‌కి షాక్.. 28 శాతం జీఎస్టీ వడ్డన..!
GST Council | ఆన్ లైన్ గేమింగ్స్, గుర్రప్పందాలు, కాషినోలపై జీఎస్టీ 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాన్సర్ నిరోధక ఔషధాలపై ఐజీఎస్టీ 12 శాతం మినహాయించాలని నిర్ణయించింది.
GST Council | ఆన్ లైన్ గేమింగ్, గుర్రప్పందాలు, కాసినో గేమ్స్ లో పాల్గొనే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. వీటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అంగీకరించింది. ఇంతకుముందు దీనిపై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) .. ఆన్ లైన్ గేమింగ్, గుర్రప్పందాలు, కాషినోలపై ప్రతిపాదిత జీఎస్టీ పెంపుపై అంగీకారానికి వచ్చింది. గోవాలో ఆన్ లైన్ గేమింగ్ విషయంలో ప్లాట్ ఫామ్ ఫీజుపై 18 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులతో ఫిక్కీ సమావేశమై జీఎస్టీ పెంచొద్దని కోరింది.
సినీప్లెక్స్ ల్లో రెస్టారెంట్లపై జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గించింది. రూ.100 ధర గల మూవీ టికెట్లపై జీఎస్టీ 12 శాతం, అంతకంటే ఎక్కువ ధర గల టికెట్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. క్యాన్సర్ నిరోధానికి దిగుమతి చేసుకున్న ఔషధాలపై జీఎస్టీ మినహాయించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇంతకుముందు 12 శాతం ఐజీఎస్టీ వసూలు చేసేవారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

