GST Council | ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ.. క్యాసినోలు, గుర్రపు పందేలపై కూడా!
GST Council | ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.
GST Council | న్యూఢిల్లీ, జూలై 11: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆయా రాష్ర్టాల మంత్రులతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌లపై పన్ను ఎంతన్నదానిపై ఎప్పట్నుంచో పరిశీలిస్తున్న మంత్రుల బృందం సిఫార్సుల ఆధారంగా ఈ 28 శాతం పన్నును నిర్ణయించినట్టు భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ తెలిపారు.
నిజానికి బెట్టింగ్ ముఖ విలువపై పన్ను వేయాలా? లేదా గేమింగ్ స్థూల రెవిన్యూపై విధించాలా? లేకపోతే ప్లాట్‌ఫామ్ ఫీజులపై మాత్రమే వర్తింపజేయాలా అన్నదానిపై మంత్రుల బృందం తర్జనభర్జనపడ్డట్టు మంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వాల్యూపై పన్ను వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆన్లైన్ గేమింగ్ సంస్థల టర్నోవర్, బెట్టింగ్ పూర్తి ముఖ విలువ, ఆట కోసం చేసే చెల్లింపులు ఇలా అన్నింటికీ పన్ను వర్తిస్తుందని వివరించారు. అయితే ఈ నిర్ణ యం మా వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని గేమిం గ్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
- సినిమా హాల్స్‌లో తినుబండారాలు, పానీయాలపై సేవా పన్ను 5 శాతానికి తగ్గింపు.
- క్యాన్సర్, అరుదైన వ్యాధులను నయం చేయడానికి వినియోగించే మందులకు జీఎస్టీ నుంచి మినహాయింపు.
- ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా జరిగే శాటిలైట్ ప్రారంభ సేవలపై ఇక జీఎస్టీ ఉండదు.
- జీఎస్టీ రేటు కంటే సెస్సు ఎక్కువ వర్తించేలా ఎస్యూవీ నిర్వచనం సవరణ. వాహనం పొడుగు (4 మీటర్లు, ఆపై), ఇంజిన్ సామర్థ్యం (1,500సీసీ, ఆపై), గ్రౌండ్ క్లియరెన్స్ (అన్లాడెడ్ క్లియరెన్స్ 170 ఎంఎం, ఆపై) ఆధారంగానే పన్ను.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

