జీఎస్టీ @ 1.02 లక్షల కోట్లు

- మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్
న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్‌వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం వరుసగా ఇది ఎనిమిదో నెల. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వసూళ్లతో పోలిస్తే మే నెలలో 27 శాతం తగ్గాయి. కానీ 2020 మే నెలకంటే తాజాగా ముగిసిన నెలలో వసూళ్లు 65 శాతం పెరగడం గమనార్హం. గతేడాది మే నెలలో దేశమంతా పూర్తి లాక్డౌన్లో వున్న సంగతి తెలిసిందే. 2021 మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లని, అందులో సీజీఎస్టీ రూ.17,592 కోట్లుకాగా, ఎస్జీఎస్టీ రూ.22,653 కోట్లు, ఐజీఎస్టీ రూ.53,199 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.26,002 కోట్లతో సహా), సెస్ రూ.9,265 కోట్లుగా (దిగుమతులపై వసూలైన రూ.868 కోట్లతో సహా) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన వివరించింది. కొవిడ్ కారణంగా పలు రాష్ర్టాలు కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు జరుపుతున్నప్పటికీ, జీఎస్టీ వసూళ్లు రూ. 1 లక్ష కోట్లను మించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.రూ.5 కోట్లలోపు టర్నోవర్ కలిగిన చిన్న పన్నుచెల్లింపుదార్లకు మే నెల జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడానికి జూలై మొదటివారం వరకూ గడువు పెంచినందున, 2021 మే నెల వాస్తవ వసూళ్లు ఇంకా పెరగవచ్చని ప్రకటన పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

