వాషింగ్టన్, జూన్ 6: ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి రేటు తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన అంచనాలకంటే 0.3 శాతం మేర తగ్గించి, జీడీపీ వృద్ధి 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్‌లో తెలిపింది. వడ్డీ వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరగడమే వృద్ధిరేటుకు తగ్గుదలకు కారణమని విశ్లేషించింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.1 శాతానికి క్షీణిస్తుందని వరల్డ్ బ్యాంక్ అంచనాల్లో పేర్కొంది. 2022లో ప్రపంచ ఆర్థికాభివృద్ధిరేటు 3.1 శాతంగా ఉన్నది.