India | తిండి కోసం దిక్కులు.. దిగుమతులు లేనిదే గడవని దుస్థితికి దేశం
యావత్తు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన పదేండ్లలో దేశాన్ని ఆకలి భారతంగా మార్చింది. తిండి కోసం విదేశాల వైపు దీనంగా చూసే దుస్థితికి తీసుకొచ్చింది.
- 16 ఏండ్ల కనిష్ఠానికి నిల్వలు
- ఆరేండ్ల తర్వాత దిగుమతులకు గ్రీన్‌సిగ్నల్?
- నిల్వలున్నాయని ఇటీవల కేంద్రం అబద్ధాలు
- ఎన్నికల్లో లబ్ధికి ప్రజల జీవితాలతో చెలగాటం
- అమాంతం పడిపోయిన గోధుమల ఉత్పత్తి
India | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): యావత్తు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన పదేండ్లలో దేశాన్ని ఆకలి భారతంగా మార్చింది. తిండి కోసం విదేశాల వైపు దీనంగా చూసే దుస్థితికి తీసుకొచ్చింది. నిన్న మొన్నటివరకూ ఉల్లి, కందిపప్పు, వంట నూనె, టమాట, చక్కెర వంటి నిత్యావసరాల కోసం దిగుమతులను ఆశ్రయించిన భారత్.. ఇప్పుడు గోధుమల కోసమూ దిక్కులు చూసే దుస్థితికి దిగజారింది. ఆరేండ్ల తర్వాత గోధుమ దిగుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుండటమే దీనికి నిదర్శనం.
నిల్వలు అథఃపాతాళానికి
గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అదే గోధుమల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన దురవస్థ దాపురించింది. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వెరసి హర్యానా, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో గోధుమల దిగుబడి భారీగా తగ్గినట్టు పారిశ్రామికవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది 112 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర గోధుమ ఉత్పత్తి ఉంటుందని కేంద్రం అంచనా వేసినప్పటికీ, 6.25 శాతం మేర ఉత్పత్తి పడిపోనున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో ఏప్రిల్‌నాటికి గోదాముల్లో నిల్వలు 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు క్షీణించాయి. ఇది 16 ఏండ్లలోనే కనిష్ఠం. దీంతో రష్యా వంటి దేశాల నుంచి ఆరేండ్ల తర్వాత గోధుమలు దిగుమతి చేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ క్రమంలో గోధుమల దిగుమతులపై ఉన్న 40 శాతం సుంకాన్ని ఎత్తివేయాలనుకొంటున్నది. ఈ మేరకు జూన్‌లో నిర్ణయం ఉండొచ్చని అంతర్జాతీయ పత్రిక ‘రాయిటర్స్’ ఓ కథనంలో వెల్లడించింది.
నిల్వలు ఉన్నాయని ఏమార్చి..
దేశీయంగా నిల్వలు తగ్గిపోతుండటంతో 2022లో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయితే, కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ చర్యలను మాత్రం చేపట్టలేదు. దీంతో గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సేకరించే గోధుమల నిల్వలూ పడిపోయాయి. ఇదే విషయమై గత జనవరిలో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఎఫ్‌సీఐ వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. స్థానిక వ్యాపారులకు 6 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను కేంద్రం సరఫరా చేసిందని, నిల్వలు లేకుంటే ఇదెలా సాధ్యమని ఉదహరించారు. విదేశాల నుంచి దిగుమతులు దిగుమతి చేసుకొనే అవసరమే లేదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ప్రయోజనం కోసమే..
నిజానికి జనవరి 1నాటికి గోదాముల్లో 16.47 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు మాత్రమే ఉన్నాయి. ఈ స్థాయిలో నిల్వలు పడిపోతే దేశంలో ఆహార సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. దీంతో అప్పుడే గోధుమల దిగుమతులు మొదలుపెట్టాలి. అయితే, విదేశాల నుంచి ఎక్కువ ఖర్చుపెట్టి గోధుమలను దిగుమతి చేసుకొంటే రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వొచ్చని, ఇది ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని కేంద్రంలోని బీజేపీ సర్కారు భావించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే సరిపడా నిల్వలు ఉన్నట్టు, దిగుమతులు అవసరమే లేదని కేంద్రమంత్రులతో అబద్ధాలు వల్లెవేయించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొరతను నివారించడానికి దిగుమతులకు తలుపులు బార్లా తెరువబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కేంద్ర సర్కారుకు ముందుచూపు లేకపోవడంతోనే దేశంలో గోధుమల కొరత ఏర్పడిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- wheat
- Wheat crop
- Wheat prices
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

