ఫ్లాష్ సేల్స్‌పై బ్యాన్.. రెగ్యులేటరీ ‘సుడిగుండం’లో ఈ-కామర్స్?!
ఫ్లాష్ సేల్స్‌పై బ్యాన్.. రెగ్యులేటరీ ‘సుడిగుండం’లో ఈ-కామర్స్?! ఈ-కామర్స్ బిజినెస్‌కు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్న..

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ బిజినెస్‌కు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఈ మేరకు వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు-2020కు గణనీయ సవరణలు చేయనున్నదని తెలుస్తున్నది.
కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా సంస్థలు తరుచుగా ఫ్లాష్ సేల్స్ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం విధించేందుకు చర్యలు చేపట్టనున్నది. ప్రత్యేకించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వ్యాపార లావాదేవీల నియంత్రణే కేంద్రం వ్యూహంగా కనిపిస్తున్నది.
ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు-2020కు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదాను రూపొందించింది. డేటా ప్రొటెక్షన్‌తోపాటు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నది.
ఈ ముసాయిదాపై వినియోగదారుల వ్యవహారాల శాఖ వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను కోరింది. 15 రోజుల్లో అంటే జూలై ఆరవ తేదీ లోగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది.
తాజాగా ప్రతిపాదించిన సవరణల వల్ల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో పారదర్శకతను తేవడంతోపాటు నియంత్రణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికార వర్గాల కథనం. ఈ-కామర్స్ సంస్థలు విస్తృతంగా మోసాలు, అనుచిత వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయని కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి.
సంప్రదాయ ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం ఉండదని, బ్యాక్ టూ బ్యాక్ లేదా ఫ్లాష్ సేల్స్ మాత్రమే నిషేధం విధిస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

