గూగుల్‌కు షాక్.. జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ దేశం
Google | కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పినేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్
Google | కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పినేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. సీసీఐ ఆదేశాలను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది.
గూగుల్ పిటిషన్‌పై స్పందన కోరుతూ సీసీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను విచారినకు స్వీకరించిన ఎన్సీల్యాట్.. బోనాఫైడ్ను చూపేందుకు జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని గూగుల్‌ను కోరింది. కాగా, సీసీఐ పెనాల్టీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. వాదనలు విన్నాక పూర్తిస్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ మేరకు సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
ఆండ్రాయిడ్ వల్ల భారత యూజర్లు, మొబైల్ తయారీ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని, భారత డిజిటల్ ప్రయాణంలో ఆండ్రాయిడ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. సీసీఐ ఉత్వర్వులతో ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ ఎన్సీల్యాట్కు విన్నవించింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సీసీఐ డైరెక్టర్ జనరల్ కాపీ కొట్టారని ఆరోపిస్తూ.. సీసీఐ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

