Google Play store | గతేడాది 22.8లక్షల యాప్స్‌ను తొలగించిన గూగుల్..!
Google Play store | గతేడాది 2023లో ప్లే స్టోర్ నుంచి 22.8 లక్షల యాప్స్‌ను గూగుల్ తొలగించింది. గూగుల్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని గూగుల్ సమాచారం ఇచ్చింది. 3,33,000 డెవలపర్ ఖాతాలను నిషేధించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మాల్వేర్ యాప్‌లన్నీ పదేపదే గోప్యతా విధానాన్ని ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.
Google Play store | గతేడాది 2023లో ప్లే స్టోర్ నుంచి 22.8 లక్షల యాప్స్‌ను గూగుల్ తొలగించింది. గూగుల్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని గూగుల్ సమాచారం ఇచ్చింది. 3,33,000 డెవలపర్ ఖాతాలను నిషేధించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మాల్వేర్ యాప్‌లన్నీ పదేపదే గోప్యతా విధానాన్ని ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఇందులో 2లక్షల యాప్‌లను గూగుల్‌లో పబ్లిష్‌కు ముందే తొలగించినట్లు పేర్కొంది. ఆయా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ ట్రాకింగ్, మెసేజ్‌లకు యాక్సెస్, కాంటాక్ట్‌లకు యాక్సెస్, మైక్రోఫోన్‌తో సహా గ్యాలరీ వంటి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా గుర్తించింది.
గూగుల్ ప్లే స్టోర్ ఇద్దరు డెవలపర్లపై ఫెడరల్ కోర్టులో దావా వేసింది. డెవలపర్ స్పామ్ యాప్‌లను పదే పదే అప్లోడ్ చేస్తున్నారని ఆరోపించింది. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సైతం ఆరోపణలు ఉన్నాయి. త్వరలో కొత్త పాలసీని తీసుకురానున్నట్టు గూగుల్ తెలిపింది. గూగుల్ యాప్ డిఫెన్స్ అలయన్స్ (ADA)ని కూడా ప్రారంభించింది. దీని కోసం మైక్రోసాఫ్ట్, మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. యాప్ భద్రత కోసం పని చేయనున్నది. ప్లే స్టోర్ కాకుండా మరేదైనా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లకు కూడా తమ పాలసీ వర్తిస్తుందని గూగుల్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

