Google Pixel | పిక్సెల్ ఫోన్లలో ‘బగ్’.. బ్యాటరీ డ్రైన్.. ఓవర్ హీట్.. గూగుల్ ఏం చెప్పిందంటే..?!
Google Pixel | గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ఫోన్లలో కొత్త అప్ డేట్ తోపాటు బగ్ వచ్చి చేరింది. తక్షణం ఈ సమస్య పరిష్కారానికి నార్మల్ బిహేవియర్ కు రిటర్న్ కావాలని యూజర్లకు గూగుల్ సూచించింది.
Google Pixel | సెర్చింజన్ గూగుల్.. తన పిక్సెల్ ఫోన్ యూజర్లకు ఇటీవల గూగుల్ యాప్ అప్ డేట్ చేసింది. కానీ ఈ అప్ డేట్ వల్ల సంబంధిత పిక్సె్ల్ ఫోన్ల బ్యాటరీ తీవ్రంగా దెబ్బ తింటున్నదని, ఓవర్ హీటింగ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్లు చెబుతున్నారు. పిక్సెల్ 6, పిక్సెల్ 7 యూజర్ల నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. యూజర్లు ఆన్ లైన్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్ లలోనూ బగ్ సమస్య తలెత్తింది. ఈ సమస్య గుర్తించగానే కంపెనీ యాజమాన్యం సదరు అప్ డేట్ ఫాజ్ చేసి.. బగ్ సమస్య పరిష్కరించిన తర్వాత అప్ డేట్ పూర్తి చేసింది.
గూగుల్ యాప్ బ్యాక్ ఎండ్ చేంజ్ వల్ల బ్యాటరీ డ్రైనింగ్ కావడంతోపాటు ఓవర్ హీట్ సమస్య తలెత్తుతున్నదని సమాచారం. ఆండ్రాయిడ్ డివైజెస్ సబ్ సెట్ మీద ప్రభావం పడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సమస్య వెలుగు చూసిన వెంటనే ‘బగ్’ సమస్య ఫిక్స్ చేస్తామని తెలిపింది గూగుల్. బగ్ వల్ల సమస్య ఎదుర్కొన్న పిక్సె్ల్ ఫోన్ యూజర్లు తమ హ్యాండ్ సెట్లను తక్షణం నార్మల్ బిహేవియర్ మోడ్‌లోకి రిటర్న్ కావాలని సూచించింది. సర్వర్ సైడ్ అప్ డేట్ కోసం ఎటువంటి సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సమస్యపై తప్పుడు సమాచారాన్ని నిలువరించడానికి రెండు న్యూ ఇమేజ్ సెర్చ్ ఫీచర్లను గూగుల్ ప్రవేశపెట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bug
- Business news
- pixel
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

