Google Pay- Cash Back Offers | గూగుల్ పేతో క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇవీ డిటైల్స్..!
Google Pay- Cash Back Offers | మీరు గూగుల్ పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారా.. అయితే దీంతో ప్రతి రోజూ రూ.500 నుంచి రూ.1000 వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
Google Pay- Cash Back Offers | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీతోపాటు పలు రకాల సర్వీసులు, పనుల కోసం స్మార్ట్ ఫోన్ ఉపకరిస్తున్నది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ సాయంతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో గూగుల్ పే యాప్ కూడా ఉంది. దీంతో యూపీఐ లావాదేవీలు, గ్రాసరీ నుంచి అన్ని రకాల వస్తువుల కొనుగోళ్ల షాపింగ్, యుటిలిటీ బిల్లులు, గ్యాస్ సిలిండర్, నీటి బిల్లుల చెల్లింపులు, ఫోన్ రీచార్జీ తేలిగ్గా చేసేయొచ్చు. గూగుల్ పే సాయంతో యుటిలిటీ బిల్లుల చెల్లింపుతో క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. గూగుల్ పేతో మనీ కూడా సంపాదించొచ్చు. ఇందుకోసం గూగుల్ ఎర్న్ మనీ ట్రిక్ ఉపకరిస్తుంది. ఈ ట్రిక్ ఎలా ఉపకరిస్తుందన్న సంగతి తెలుసుకుందామా…!
స్మార్ట్ ఫోన్ల యూజర్లు ‘గూగుల్ పే’ రిఫరల్ కోడ్ వినియోగిస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. ముందుగా గూగుల్‌పే యాప్ యూజర్లు తమ గూగుల్ పే యాప్ లింక్‌ను మిత్రులు, పరిచయస్తులకు షేర్ చేస్తే.. యాప్ అందించే ఆఫర్ ప్రకారం రూ.101 నుంచి రూ.201 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇతరులు మీ లింక్ ద్వారా గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకుని లావాదేవీలు జరిపితేనే ఈ ఆఫర్ పని చేస్తుంది. మీరు పంపిన గూగుల్ పే యాప్‌ను మీ మిత్రులు, పరిచయస్తులు వాడకపోయినా ముందు మీ ఖాతాకు రూ.200 పంపించమనండి.. తరిగి మీరు ఆ వ్యక్తికి రూ.200 పంపేయొచ్చు. అలా చేసినా మీకు రూ.101 – 201 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇలా రోజూ ఐదుగురికి గూగుల్ పే యాప్ లింక్ పంపితే రూ.500 నుంచి రూ.1000 వరకూ ఆదాయం పొందొచ్చు.
గూగుల్ పే యాప్‌లో ఖాతా ప్రారంభించాలంటే మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. మీ స్మార్ట్ ఫోన్ మొబైల్ నంబర్ ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానించాలి. ఏటీఎం లేదా డెబిట్ కార్డు కూడా ఉండాలి. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి గూగుల్ పే అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. అటుపై గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ / ఇన్ స్టాల్ లింక్ మీద క్లిక్ చేయాలి. దీంతో స్మార్ట్ ఫోన్ లో గూగుల్ అప్లికేషన్ డౌన్ లోడ్ అవుతుంది. చివరిగా గూగుల్ పే మొబైల్ యాప్ తెరిచి ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

