Sundar Pichai | గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్.. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచ్చాయ్కు తీపి కబురు అందించింది. సుందర్ పిచ్చాయ్ పనితీరు బాగా ఉందని అల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఆయన పనితీరుకు గుర్తింపుగా పిచ్చాయ్కు కొత్త ఈక్విటీ అవార్డ్ కేటాయిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఇతర ఎస్ అండ్ పీ 100 కంపెనీల్లో భాగంగా గణనీయ వాటాలను సుందర్ పిచ్చాయ్కు కేటాయించింది.
సుందర్ పిచ్చాయ్కు పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ (పీఎస్యూ) 43 నుంచి 60 శాతానికి పెంచుతున్నట్లు అల్ఫాబెట్ ప్రకటించింది. 2019లో 43 శాతం పీఎస్యూ స్టాక్స్ కేటాయించింది. ప్రతి మూడేండ్లకోసారి పనితీరును బట్టి సీఈవో వేతనాన్ని పెంచుతూ ఉంటుంది. రెండు విడుతల్లో 63 మిలియన్ డాలర్ల చొప్పున కేటాయిస్తుంది. ఇంకా అల్ఫాబెట్ రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ నుంచి 84 మిలియన్ డాలర్ల గ్రాంట్ కూడా సీఈవోకు లభిస్తుంది.