గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 09, 2021 , 18:02:45

ఒక్క‌రోజే రూ.2000 త‌గ్గిన పుత్త‌డి

ఒక్క‌రోజే రూ.2000 త‌గ్గిన పుత్త‌డి

న్యూఢిల్లీ: దేశీయంగా బులియ‌న్ మార్కెట్‌లో ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాలో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది. 4.10 శాతంతో రూ.2086 ప‌త‌న‌మైంది. అవును ఇది నిజ‌మే. శుక్ర‌వారం ఫ్యూచ‌ర్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఫిబ్ర‌వ‌రిలో తులం బంగారం ధ‌ర భారీగా ప‌డిపోయింది. దీన్ని బ‌ట్టి భవిష్యత్‌లో బంగారం ధరలు భారీగా పతనం కానున్నాయ‌నిపిస్తున్న‌ది.

విశ్వాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తున్న వేళ అంతకంతకు పెరిగిపోయిన పసడి ధరలు వ్యాక్సిన్‌ రాకతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక వెండి ధర కూడా భారీగానే పతనమైంది. 8.8 శాతంతో వెండి కిలో రూ.6,100 తగ్గి, రూ.63,850గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడుతుండటంతో బులియన్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతున్నద‌ని  నిపుణులు చెబుతున్నారు.

ఇక శనివారం దేశీయంగా బంగారం ధరలు పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650గా నమోదు కాగా, 24 క్యారెట్లు(10గ్రాములు) 54,160కు చేరుకున్న‌ది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధ‌ర రూ.49,820ల‌కు, 24 క్యారెట్ల బంగారం తులం ధ‌ర రూ. 50,820, కోల్‌క‌తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50190 ప‌లికితే, 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ. 52,890ల‌కు చేరింది.

ఇక చెన్నైలో ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.47,920, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,270, బెంగ‌ళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.47,500, 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.51,800 వ‌ద్ద స్థిర ప‌డింది. అమెరికాలో సెనెట్‌పై డెమోక్రాట్లు ప‌ట్టు బిగించ‌నున్నార‌న్న వార్త‌లు బులియ‌న్ మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బ‌లోపేతం చేశాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo