Gold Rates | ఐదు రోజులుగా పైపైకి బంగారం ధరలు.. కారణం అదేనా..?!
Gold Rates | గత నెలాఖరులో ఓనం వేడుకలు, తాజాగా వినాయక చవితితో దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. మరోవైపు యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో బంగారం ధరలు ఐదు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.
Gold Rates | గణేశ్ చతుర్థితో పండుగల సీజన్ ప్రారంభమైంది. ప్రజల్లో బంగారం, బంగారం ఆభరణాల పట్ల గిరాకీ పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో గత ఐదు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం (2023 సెప్టెంబర్ 19) నాడు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.55,200, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60,220 పలికింది. సోమవారం ధరతో పోలిస్తే 22 క్యారట్ల బంగారం తులం రూ.150, 24 క్యారట్ల బంగారం రూ.140 పెరిగిందని తెలుస్తున్నది.
ఈ నెల 15న హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.54,700, 24 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.59,670 పలికింది. ఐదు రోజుల్లో 99.9 స్వచ్ఛత గల బంగారం తులం రూ.550, 22 క్యారట్ల పసిడి రూ.500 పెరిగింది. ఇక కిలో వెండి ధర ఈ నెల 15 నుంచి మంగళవారానికి రూ.800 పెరిగింది. ఈ నెల 15న రూ.77,500 పలికితే, మంగళవారం రూ.78,300 వద్ద స్థిర పడింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.55,200 పలుకుతున్నది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.60,220 వద్ద స్థిర పడింది. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర సోమవారంతో పోలిస్తే రూ.100 పెరిగి రూ.78,300 వద్ద ముగిసింది.
చెన్నైలో 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.55,500 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.60,550 వద్ద నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీలో ఉపయోగించే పది గ్రాముల బంగారం (22 క్యారట్లు) రూ.55,350, 24 క్యారట్ల బంగారం తులం రూ.60,370 వద్ద స్థిర పడింది.
ఈ వారంలో అమెరికా ఫెడ్ రిజర్వు్ సమావేశం కానున్నది. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచితే డాలర్ పై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గం పసిడి వైపు మళ్లుతుండటంతో బంగారం ధర ‘ధగధగ`మని మెరుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

