Gold Price | పసిడి కొనేవారికి అదిరిపోయే వార్త..! బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా..?
Gold Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బంగారం ధర భారీగా పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం పసిడి ధర రూ.1000 తగ్గి తులానికి రూ.98,400 చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 ప్యూరిటీ గోల్డ్ గురువారం పది గ్రాముల ధర రూ.99,400 వద్ద ముగిసింది.
Gold Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బంగారం ధర భారీగా పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం పసిడి ధర రూ.1000 తగ్గి తులానికి రూ.98,400 చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 ప్యూరిటీ గోల్డ్ గురువారం పది గ్రాముల ధర రూ.99,400 వద్ద ముగిసింది. ఇక 99.5 ప్యూరిటీ గోల్డ్ సైతం రూ.1000 పతనమై తులానికి రూ.97,900కి చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.
దాంతో బంగారం ఆస్తులకు డిమాండ్ తగ్గించింది. డాలర్ బలపడిన నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా 125 శాతం సుంకాల నుంచి యూఎస్ దిగుమతులను మినహాయించనున్నట్లు ప్రకటించింది. అయితే, అధికారిక వాణిజ్య చర్చల జరుగుతున్నాయన్న వార్తలను తిరస్కరించింది. అయితే, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు. ప్రధాన శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా వ్యాపారులు నిరసన వ్యక్తం చేయడంతో శుక్రవారం స్థానిక బులియన్ మార్కెట్లు మూతపడ్డాయి. మరో వైపు సోమవారం వెండి ధర రూ.1400 తగ్గి.. కిలో ధర రూ.98,500కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం దాదాపు ఒక శాతం తగ్గి ఔన్సుకు 3,291.04 డాలర్లకు చేరుకుంది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ విశ్లేషకుడు వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ అమెరికా అనేక దేశాలతో సుంకాలపై చర్చలు ప్రారంభించడం, చైనా-యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గుతున్నది. అంతేకాకుండా, రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై నేపథ్యంలోనే డిమాండ్ పడిపోతున్నది.
ఆసియా మార్కెట్లో స్పాట్ వెండి 0.2 శాతం తగ్గి ఔన్సుకు 33.05 వద్ద ట్రేడవుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

