Gold Price | రూ.లక్షకు చేరువైన తులం బంగారం.. సరికొత్త గరిష్ఠాలకు పసిడి, వెండి ధరలు..!
Gold Price | పుత్తడి ధర బెంబేతెత్తిస్తున్నది. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరి.. తులానికి రూ.లక్షకు చేరువైంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది.
Gold Price | పుత్తడి ధర బెంబేతెత్తిస్తున్నది. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరి.. తులానికి రూ.లక్షకు చేరువైంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 ప్యూరిటీ బంగారం ధర ఒకే రూ.1,650 పెరిగి తులానికి రూ.98,100 చేరింది. పుత్తడి ధర రూ.96,450 వద్ద ఉండేదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరో వైపు 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.1,650 పెరిగి తులానికి రూ.97,650కి పెరిగి గరిష్ఠానికి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర సైతం రూ.1,900 పెరగడంతో కిలో రూ.99,400కి పెరిగింది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 3,318 డాలర్లు చేరింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 3,299.99 డాలర్లకు పతనమైంది.
అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం నడుస్తున్నది. ఈ క్రమంలో బంగారం ధర పెరుగుతోందని కొటక్ సెక్యూరిటీస్‌లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా తెలిపాడు. బుధవారం అమెరికా చైనా నుంచి దిగుముతి చేసుకునే వస్తువులపై సుంకాలను 254 శాతానికి పెంచింది. ఈ క్రమంలో మార్కెట్‌పై మరింత ఒత్తిడి పడింది. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ.. అమెరికా డాలర్ ఇండెక్స్ 100 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో, మూడేళ్ల కనిష్ఠానికి చేరుకోవడంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో గరిష్ఠాలను తాకుతున్నాయన్నారు. వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాన్ని పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారని.. ఈ క్రమంలో బంగారం ధర పెరుగుతోందని పేర్కొన్నారు. మరో వైపు ఆసియా మార్కెట్లో స్పాట్ సిల్వర్ దాదాపు 2శాతం పెరిగి 32.86 డాలర్లకు చేరుకుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

