Gold Imports | గతేడాది 24 శాతం తగ్గిన బంగారం దిగుమతి.. కారణం అదేనా..!
Gold Imports | అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అధిక సుంకాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24.15 శాతం తగ్గిపోయాయి.
Gold Imports | బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. మరీ మహిళలకు ప్రీతి. ప్రతి పండక్కి.. కుటుంబ వేడుకలకు ప్రతి మహిళ పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశ పడుతుంది. ధర తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం కొనుగోలు చేస్తుంటారు. కొనలేని వారు ఉన్న ఉన్న ఆభరణాలే ధరించడానికి మొగ్గుతుంటారు. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మాత్రం `షాక్` కొడుతున్నాయి.
అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేయడానికి యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, చైనాలో పూర్తిగా గాడిలో పడని ఆర్థిక వ్యవస్థ.. తదితర కారణాలతో ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా పుత్తడిని చూస్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు బంగార`మంటూ పైపైకి దూసుకెళ్తున్నాయి.
క్రూడాయిల్ ధర పెరిగినా, అమెరికా డాలర్ విలువ పెరిగినా.. ఆర్థిక సంక్షోభం తలెత్తినా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నా దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిపోతున్నది. దీనికి తోడు దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు సుంకాలు పెంచడంతో పసిడి మరింత పిరమవుతున్నది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు నాలుగో వంతు తగ్గుముఖం పట్టాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24.15 శాతం తగ్గి 35 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021-22లో బంగారం దిగుమతుల విలువ 46.2 బిలియన్ డాలర్లు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బంగారం దిగుమతులు నెగెటివ్ జోన్లో నిలిచాయి. 2022 మార్చిలో 100 కోట్ల డాలర్ల విలువ గల బంగారం దిగుమతి జరిగితే ఈ ఏడాది మార్చిలో 330 కోట్ల డాలర్ల విలువ గల బంగారం దిగుమతైంది.
2022-23 ఏప్రిల్-జనవరి మధ్య దాదాపు 600 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. అధిక దిగుమతి సుంకం వల్ల బంగారం దిగుమతులు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రతియేటా 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. కానీ, వెండి దిగుమతులు మాత్రం 2021-22తో పోలిస్తే 2022-23లో 6.12 శాతం పెరిగి 529 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
బంగారం దిగుమతులు భారీగా తగ్గినా.. వాణిజ్య లోటు తగ్గించలేకపోయాయి. 2021-22లో మర్చండైల్ వాణిజ్య లోటు 191 బిలియన్ డాలర్లు ఉంటే.. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 267 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. దేశీయ జ్యువెల్లరీ ఆభరణాల పరిశ్రమకు చేయూతనివ్వడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి `బంగారం దిగుమతి సుంకం`పై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం ఎగుమతులు మూడు శాతం తగ్గి 38 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

