మళ్లీ రూ.47 వేలు దాటిన పసిడి ధర
Gold Price: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర రూ.47 వేల మార్కును దాటింది.

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర రూ.47 వేల మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.146 పెరిగి రూ.47,110కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.46,964 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.513 పెరిగి రూ.70,191కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.69,678 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,834 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి 27.20 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

