పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
బంగారం, వెండి ధరలు క్రమేణా పడిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో తులం పసిడి రేటు రూ.4,200 క్షీణించగా, కిలో వెండి విలువ రూ.13,000 పతనమైంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,900 దిగి రూ.1,46,100 (అన్ని పన్నులు సహా) వద్ద స్థిరపడిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
- 3 రోజుల్లో రూ.4,200 దిగిన తులం
- రూ.13,000 తగ్గిన కిలో వెండి
- క్రూడాయిల్ రేట్ల ప్రభావం
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : బంగారం, వెండి ధరలు క్రమేణా పడిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో తులం పసిడి రేటు రూ.4,200 క్షీణించగా, కిలో వెండి విలువ రూ.13,000 పతనమైంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,900 దిగి రూ.1,46,100 (అన్ని పన్నులు సహా) వద్ద స్థిరపడిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక కేజీ వెండి రేటు రూ.5,500 తగ్గి రూ.2,02,000 దగ్గర నిలిచింది. గత నెల సెప్టెంబర్ 30 నుంచి వెండి ధర రూ.30,000 (13 శాతం) దిగజారడం గమనార్హం. కమోడిటీ మార్కెట్లలో సెల్లింగ్ ప్రెషర్ గట్టిగానే ఉందని ట్రేడర్లు చెప్తున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ 4,024.37 డాలర్లు పలికింది. సిల్వర్ 53.83 డాలర్లుగా ఉన్నది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ పుత్తడి తులం రూ.1,900 దిగి రూ.1,42,480గా నమోదైంది. ఇక 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 క్షీణించి రూ.1,30,600గా ఉన్నది. నిజానికి ప్రస్తుత పండుగ సీజన్లో మార్కెట్ కొనుగోలుదారులతో కళకళలాడాల్సి ఉన్నది. కానీ దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు.. వ్యాపారావకాశాలను బాగా దెబ్బతీస్తున్నాయని జ్యుయెల్లర్స్ వాపోతున్నారు. దీంతో వచ్చే నెల 6న ధనత్రయోదశి సేల్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చన్న అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని, పండుగలు, శుభకార్యాలకు అవసరమైనంత మేరకే కొనేందుకు ముందుకు వస్తున్నట్టు చెప్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో..
ఈ ఏడాది ఆరంభంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే జనవరి 29న 24 క్యారెట్ తులం గోల్డ్ రేటు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైని సృష్టిస్తూ రూ.1,83,000గా నమోదైంది. కిలో వెండి ధర కూడా రూ.4,04,500 పలికింది. కానీ దాదాపు ఈ 9 నెలల్లో బంగారం ధర రూ.37,000, వెండి రేటు రూ.2,02,500 పడిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం, ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితుల సెగ.. మార్కెట్‌కు గట్టిగానే తగులుతున్నది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 115 డాలర్లను దాటడం కూడా గోల్డ్ మార్కెట్‌ను కుదిపేస్తున్నది.
పతనానికి ప్రధాన కారణాలు?
- విజృంభిస్తున్న ముడి చమురు ధరలు
- బలపడుతున్న డాలర్ విలువ
- బాండ్ల రాబడులు ఆకర్షణీయం
- ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు
- గ్లోబల్ మార్కెట్లో ప్రతికూలతలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

