హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఎఫ్టీసీసీఐ నడుంబిగించింది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించేందుకుగాను ఐఐటీ-హైదరాబాద్ సహకారం తీసుకోనున్నది. భవిష్యత్తు ప్రణాళికలకు తగ్గట్టుగా నూతన ఆవిష్కరణల ద్వారా పరిశ్రమకు తగిన చేయూతను అందించేందుకుగాను ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఎఫ్టీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఐఐటీ-హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ దేశాయ్ మాట్లాడుతూ..రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నూతన సాంకేతికతలపై పరిశ్రమ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాలు వచ్చే పదేండ్లలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నట్లు చెప్పారు.