Changes From 1 April 2022 | కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్పులివే.. !
Changes From 1 April 2022 | కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో సామాన్యుడి నుంచి వ్యాపారుల లావాదేవీలపై పలు మార్పులు అమల్లోకి వచ్చాయి.
Changes From 1 April 2022 | కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి వల్ల సామాన్యుడు మొదలు వ్యాపార వేత్తల ఆర్థిక లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ప్రావిడెండ్ ఫండ్, ఆస్తి పన్ను, గ్యాస్ ధరలు, ఔషధాలు, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపుపై మీద పన్ను.. ఆయా విభాగాల్లో పెట్టుబడులకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవేమిటో ఓ లుక్కేద్దాం..
కోవిడ్ ఆంక్షల ఎత్తివేత
దేశంలో కోవిడ్-19 కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. 2020 నుంచి కోవిడ్-19 నియంత్రణకు కేంద్రం విధించిన ఆంక్షలను శుక్రవారం నుంచి పూర్తిగా ఎత్తివేసింది.
పాన్‌తో ఆధార్ అనుసంధానం
శుక్రవారం నుంచి పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గత నెల 31 (గురువారం) లోగా అనుసంధానించాల్సి ఉంది. ఇక నుంచి ఆధార్-పాన్ అనుసంధానానికి రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
సొంతిల్లు కొనుగోలు భారమేనా?
శుక్రవారం నుంచి సొంతిల్లు కొనుగోలుచేసే వారికి ఖర్చులు పెరగనున్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 80ఈఈఏ సెక్షన్ కింద ఇచ్చిన పన్ను మినహాయింపులను కేంద్రం నిలిపివేసింది. దీంతోపాటు ముంబైలో ఇల్లు కొనుగోలు చేసేవారు ఒకశాతం మెట్రో సెస్ చెల్లించాల్సి ఉంటుంది.
పెరగనున్న వాహనాల ధరలు
ముడి సరుకుల ధరలు పెరగడంతో అన్ని ఆటోమొబైల్ సంస్థలు శుక్రవారం నుంచి తమ కార్లు, బైక్‌లు, వాణిజ్య వాహనాల ధరలు పెరిగాయి. శుక్రవారం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్క్రాపేజీ పాలసీ కూడా అమల్లోకి వచ్చింది.
ప్రాణ రక్షక ఔషధాలు కాస్ట్లీ
దేశవ్యాప్తంగా 800కి పైగా ఔషధాల ధరలు పెరిగాయి. వీటిల్లో పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, యాంటీ వైరస్ మాత్రలు ఉన్నాయి. ఎంపిక చేసిన ఔషధాల ధరలను ఫార్మా కంపెనీలు 10 శాతానికి పైగా పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇలా
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై శుక్రవారం నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్ చెల్లింపులు డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. చెక్‌ల ద్వారా చెల్లింపులు అనుమతించరు. బ్రోకర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు జరుపడానికి వీల్లేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ రిస్క్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది.
క్రిప్టో పెట్టుబడులపై ఇలా పన్ను
క్రిప్టో కరెన్సీలుగా పేరొందిన వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)లో పెట్టుబడుల్లో లాభాలు, నష్టాలతో సంబంధం లేకుండా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు బిట్ కాయిన్‌పై రూ.100 లాభ పడి ఉంటారనుకుందాం.. మరో టోకెన్ డోజ్ కాయిన్ ( Dogecoin ) మీద రూ.70 నష్టపోయారనుకుందాం.. కానీ మీరు లాభ పడిన రూ.100 మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బిట్ కాయిన్లో లాభ పడిన రూ.100లో డిజ్కాయిన్లో నష్టం రూ.70 తీసివేస్తే నికర లాభం రూ.30 వచ్చినా.. నష్టంతో సంబంధం లేకుండా మొత్తం రూ.100 పైన పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
ఎన్‌పీఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఇలా
కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మీద 14 శాతం వరకు టాక్స్ బెనిఫిట్ క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) కింద ఈ బెనిఫిట్ పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

