ఈ-కామర్స్‌పై ఫ్రెషర్స్‌కు మోజెక్కువే
ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలపై ఫ్రెషర్స్ అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), టెలీకమ్యూనికేషన్స్, ఐటీ రంగాల్లో కొలువులను ఫ్రెషర్స్ ఇష్టపడుతున్నట్టు జాబ్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక అప్నా.కో చేపట్టిన సర్వే చెప్తున్నది.
- బీఎఫ్ఎస్ఐ, టెలికం రంగాలపైనా ఆసక్తి
- తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలపై ఫ్రెషర్స్ అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), టెలీకమ్యూనికేషన్స్, ఐటీ రంగాల్లో కొలువులను ఫ్రెషర్స్ ఇష్టపడుతున్నట్టు జాబ్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక అప్నా.కో చేపట్టిన సర్వే చెప్తున్నది. కెరియర్లో ఆకర్షణీయ, స్థిరమైన వృద్ధి అవకాశాలు, వృత్తి-వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తూ ఆయా రంగాలపై కొత్తగా వచ్చే ఉద్యోగార్థులు దృష్టి పెడుతున్నట్టు అప్నా.కో స్పష్టం చేసింది.
ఏయే రంగాల్లో..
ఈ-కామర్స్ కంపెనీల్లో ఉద్యోగాలను అత్యధికంగా 22 శాతం ఫ్రెషర్స్ ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ మార్కెట్‌తో పోల్చితే ఆన్లైన్ మార్కెట్‌కు కొనుగోలుదారులు ఇస్తున్న ప్రాధాన్యత, డిమాండ్ దృష్ట్యానే మెజారిటీ ఫ్రెషర్స్ ఈ-కామర్స్ రంగం దిశగా వెళ్తున్నట్టు అప్నా.కో చెప్పింది. ఇక బీఎఫ్ఎస్ రంగంపై 18 శాతం ఫ్రెషర్లు, టెలీకమ్యూనికేషన్స్పై 13 శాతం, ఐటీ రంగంపై 5 శాతం మంది ఫ్రెషర్లు మక్కువ చూపుతున్నారు. ఈ రంగాల్లో ఆ మేరకు ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్టు అప్నా.కో తెలియజేసింది. కాగా, ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని 10వేలకుపైగా ఫ్రెషర్స్ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
- సూరత్, జైపూర్, గ్వాలియర్, భోపాల్, ఇండోర్, లక్నో, కాన్పూర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఎక్కువమంది యువకులు ఈ-కామర్స్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ఉద్యోగాలను ఆశిస్తున్నారు.
- కంపెనీల స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తున్న 34 శాతం మంది ఫ్రెషర్స్. బ్రాండ్, రెప్యుటేషన్ ఆధారంగా 22 శాతం మంది ఆయా సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ జియోలకు క్యూ కడుతున్న ఫ్రెషర్లు.
- వృత్తిగత, వ్యక్తిగత జీవితాలు బ్యాలెన్స్ అయ్యేలా ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడానికి వీలున్న కంపెనీలను ఇష్టపడుతున్న 38 శాతం మంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

