Foxconn | 15న ఫాక్స్‌కాన్ భూమిపూజ.. కొంగరకలాన్‌లో పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు
ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమారు రూ.1,656 కోట్ల(200 మిలియన్ డాలర్లు)కు పైగా పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ తయారీ కేంద్రంతో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Foxconn | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమారు రూ.1,656 కోట్ల(200 మిలియన్ డాలర్లు)కు పైగా పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ తయారీ కేంద్రంతో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యాపిల్ నుంచి భారీ ఆర్డర్ పొందిన ఫాక్స్‌కాన్..ఈ కొంగరకలాన్‌లో నెలకొల్పనున్న ప్లాంట్‌లో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్లలో 70 శాతం ఫాక్స్‌కాన్ ఉత్పత్తి చేసినవే కావడం గమనార్హం.
గత నెల ప్రారంభంలో ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అనంతరం యంగ్ ల్యూ వీలైనంత తొందరలోనే కొంగరకలాన్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. కంపెనీ కోరికమేరకు కొంగరకలాన్‌లో పరిశ్రమ ఏర్పాటునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ సాధ్యమైనంత తొందరలోనే పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముహూర్తం ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇటీవలే యాపిల్ కంపెనీ ఎయిర్పాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటివరకూ కేవలం ఫోన్లను మాత్రమే తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్, కొత్తగా ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగు పెడుతున్నది.
ఆకర్షించిన ప్రభుత్వ విధానాలు..
ఇంతకాలం చైనాకు చెందిన కంపెనీలు యాపిల్‌కు వైర్లెస్ ఇయర్ఫోన్లు, ఛార్జర్లు వంటివి సరఫరా చేస్తుండగా… క్రమంగా చైనాలో కార్యకలాపాలను తగ్గించి, భారత్‌కు తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణ కేంద్రంగా యాపిల్ ఫోన్‌కు ఇయర్ఫోన్లు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలో ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ భారత్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించిన సందర్భంలో దేశంలోని అనేక రాష్ర్టాలు ఫాక్స్‌కాన్‌ను తమ రాష్ర్టానికి రప్పించుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో కంపెనీ ప్రతినిధులు పలు ఇతర రాష్ర్టాలను కూడా సందర్శించారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలు, స్నేహపూర్వక వాతావరణం, సులభతర విధానాలు ఫాక్స్‌కాన్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్నిటికి మించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ను విశేషంగా ఆకర్షించింది. దీంతో ఇతర రాష్ర్టాలను కాదని ఫాక్స్‌కాన్ భారత్‌లో తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంపికచేసుకున్నది.
రూపు మారనున్న కొంగరకలాన్
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఫాక్స్‌కాన్ కంపెనీ ఎట్టకేలకు పరిశ్రమ ఏర్పాటు ముహూర్తాన్ని ఖరారుచేయడంతో ఇప్పుడు అందరి దృష్టి కొంగరకలాన్పై పడింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ ఫోన్‌గా పేరొందిన ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ప్లాంట్ కొంగరకలాన్‌లో ఏర్పాటు కానుండటంవల్ల ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. దాదాపు 35 వేలమందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని సంస్థ ఇదివరకే ప్రకటించడంతో పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయని, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, ఫాక్స్‌కాన్ పరిశ్రమకు అనుబంధంగా మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

