Ratan Tata | న్యూఢిల్లీ, జూన్ 27: క్రిప్టోకరెన్సీ సంస్థలతో తనకు ఏ రకమైన సంబంధాలు లేవని టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. క్రిప్టోల్లో తాను పెట్టుబడి పెట్టినట్టు వస్తున్న వార్తలను మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘క్రిప్టోకరెన్సీలతో నాకు ఏ రూపంలోనూ సంబంధాలు లేవు.
కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలని నేను నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధాలున్నాయనిగానీ, పెట్టుబడులు పెట్టాననిగానీ వార్తలు, ప్రకటనలు చూస్తే అవన్నీ అబద్ధాలేనన్నారు. దాన్నో కుంభకోణంగా పసిగట్టాలంటూ ఇటీవల వచ్చిన అబద్ధపు ఆర్టికల్‌ను ట్విట్టర్‌పై పోస్ట్ చేశారు.