Forex Reserve | ఏడు నెలల కనిష్టానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు.. ఎందుకంటే..?!
Forex Reserve | ఈ నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లతో ఏడు నెలల దిగువకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Forex Reserve | వరుసగా మూడో వారం భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తగ్గిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లతో ఏడు నెలల దిగువకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20వ తేదీన ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 8.5 బిలియన్ డాలర్లు పతనం అయ్యాయి. నెలలో ఒకవారం అత్యధికంగా ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పతనం కావడం ఇదే ప్రథమం. అంతకు ముందు రెండు వారాల్లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 5.2 బిలియన్ డాలర్లు తగ్గాయి. గతవారం అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.85.10లకు పడిపోయింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతోపాటు భారత్ వృద్ధిరేటు మందగమనం ఆందోళన మధ్య అక్టోబర్ మధ్యలో డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.84 వద్ద తచ్చాడుతూ వచ్చింది. డాలర్ మీద రూపాయి మారకం విలువ 0.3 శాతం పతనమై రూ.85.5325 వద్ద స్థిర పడింది. జూన్ నాలుగో తేదీ నుంచి రూపాయి దారుణంగా పతనం కావడం ఇదే మొదటిసారి.
ఈ నెల 13తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు పతనమై 652.869 బిలియన్ డాలార్లకు చేరాయి. సెప్టెంబర్ నెలాఖరులో పారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. తాజాగా ఈ నెల 20 నాటికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 6.014 బిలియన్ డాలర్లు క్షీణించి 556.562 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. గోల్డ్ రిజర్వ్స్ 2.33 బిలియన్ డాలర్లు పతనమై 65.726 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 112 మిలియన్ డాలర్లు తగ్గి 17.885 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వ్ నిల్వలు 23 మిలియన్ల డాలర్లు పతనమై 4.217 బిలియన్ డాలర్లకు చేరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

