Forbes’ India billionaires | ముకేశ్ ఫస్ట్.. అదానీ సెకండ్.. ఇండియన్ బిలియనీర్స్ వీళ్లే!
Forbes' India billionaires | ఇండియన్ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, శివ్ నాడార్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Forbes’ India billionaires | భారతీయ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ టాప్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. దీంతో భారత్‌లో అత్యంత సంపన్నుడిగా, ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచాడు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ 90 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలోనూ నిలవగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ్ నాడార్ 28.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో అగ్రశ్రేణి కుబేరుడయ్యారు. గతేడాది మాదిరిగానే టాప్-3 జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, శివ్ నాడార్ నిలిచారు.
ఏడు శాతం పెరిగిన ముకేశ్ అంబానీ సంపద
2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ ఏడు శాతం పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు రిఫైనరీ కాంప్లెక్స్, దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌తో జియో, తదితర వ్యాపారాల్లో రిలయన్స్ సేవలందిస్తున్నది.
ఆసియాలో రెండో కుబేరుడు అదానీ
భారత్‌తోపాటు ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద కుబేరుడు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 90 బిలియన్ల డాలర్లు. నౌకాశ్రయాలు మొదలు విమానాశ్రయాల వరకు, థర్మల్ విద్యుత్, బొగ్గు రంగాల్లో అదానీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. గత కొన్ని నెలలుగా కుబేరుల్లో మొదటి స్థానం కోసం ముకేశ్ అంబానీ, గౌతం అదానీ పోటీ పడుతున్నారు. వచ్చే దశాబ్దిలో భారత్‌ను హరిత ఇంధన శక్తిగా తీర్చిదిద్దేందుకు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు.
సీరం అధినేత సైరస్ పూనావాలా ఇలా
కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్ రూపొందించడంలో ముందు వరుసలో నిలిచిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అధినేత సైరస్ పూనావాలా కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. సైరస్ పూనావాలా వ్యక్తిగత సంపద 24.3 బిలియన్ల డాలర్లు. డీ-మ్యాట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ గతేడాది ప్రపంచంలోని టాప్-100 బిలియనీర్ల జాబితాలో చేరారు. ఈ ఏడాది 20 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశంలో ఐదో కుబేరుడి అవతారం ఎత్తారు.
ఇలా ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్
ఉక్కు ధరలు పెరిగిపోవడంతో ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ వ్యక్తిగత ఆస్తి 17.9 బిలియన్ డాలర్లు. భారత కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ల డాలర్లతో ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
8వస్థానంలో కుమార మంగళం బిర్లా
ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ మంగళం బిర్లా వ్యక్తిగత సంపద 16.5 బిలియన్ డాలర్లు. కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ సంఘ్వీ 15.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో ర్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ 14.3 బిలియన్ డాలర్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే ఇండియన్ కుబేరులిలా
గతేడాదితో పోలిస్తే భారత్‌లో కొత్తగా బిలియనీర్లు పెరిగారు. 2020-21లో 140 మంది కుబేరులు ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో 166కు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు ఐపీవోల ద్వారా సుమారు 15.6 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకున్నారని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

