న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మే 5న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. మే 5 నుంచి ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఐఫోన్ 13 సహా పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మే 10న ముగియనున్న సేల్‌లో ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, రియల్‌మి సీ55, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ 7 వంటి ఫోన్లపై ఆకర్షణీయ తగ్గింపు ధరలను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ సందర్భంగా పిక్సెల్ 6ఏ రూ. 25,999, రియల్‌మి జీటీ నియో 3టీ రూ. 19,999కి అందుబాటులో ఉంటాయి. పోకో ఎక్స్5 ప్రొ రూ. 20,999కి, రియల్‌మి 10 ప్రొ+ 5జీ రూ. 22999కి లభిస్తాయి. బడ్జెట్ ఫోన్ రియల్‌మి సీ55 రూ. 7999కి సేల్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇక ఐఫోన్ 13 కూడ క్రేజీ ప్రైస్‌కి సేల్‌లో లభ్యమవుతుందని ప్రకటించినా ఏ ధరకు సేల్‌లో లభిస్తుందనే వివరాలను ఈ-కామర్స్ దిగ్గజం ఇంతవరక వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌కు ఈ హాట్ డివైజ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఇక పిక్సెల్ 7 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999కి లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ధరపై లభిస్తాయి.
Read More
ఫ్రాంక్ఫర్ట్ టూ హైదరాబాద్ లుఫ్తాన్సా ఫ్లైట్