హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెందిన ఐదు గనులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాయి. ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. 7 విభాగాల్లో, 50 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ గనుల జాబితాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసింది.
ఖైరిగూడ (బెల్లంపల్లి), ఆర్జీ ఓసీ -1 (రామగుండం), ఆర్కే న్యూటెక్ (శ్రీరాంపూర్), ఆర్కే-6 (శ్రీరాంపూర్), జేవీఆర్ ఓసీ -2 (సత్తుపల్లి) లు జాతీయ స్థాయిలో అత్యుత్తమ గనుల జాబితాలో చోటును దక్కించుకున్నాయి. సింగరేణి చరిత్రలో ఒకే సారి ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇక మరో 17 గనులు ఫోర్స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి.