Pre-Budget Discussions | అక్టోబర్ 12 నుంచి 2022-23 బడ్జెట్ కసరత్తు షురూ!
Pre-Budget Discussions | అక్టోబర్ 12 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రీ-బడ్జెట్ చర్చలు మొదలవుతాయి.

Pre-Budget Discussions | వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కసరత్తు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది మోదీ 2.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న నాలుగో వార్షిక బడ్జెట్ కానున్నది. 2022 ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. గత కొన్నేండ్లుగా ఫిబ్రవరి ఒకటో తేదీనే కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న అంచనాల మధ్య ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ, ఆర్థిక వృద్ధిరేటు వేగవంతం చేయడంపైనే బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ చేయనున్నారు. అక్టోబర్ 12 నుంచి 2022-23 బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రీ-బడ్జెట్ చర్చలు ప్రారంభం అవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
వివిధ శాఖలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి తమ ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులపై వేర్వేరుగా ఆర్థికశాఖకు నివేదికలు సమర్పిస్తాయి. వివిధ రంగాల పారిశ్రామిక ప్రముఖులు, పారిశ్రామిక సంఘాల నేతలతోనూ ఆర్థిక మంత్రి సమావేశమవుతారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి :
ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం.. రేవంత్‌పై కోర్టులో కేటీఆర్ పిటిషన్
#RahulDrugTest: రాహుల్ డ్రగ్టెస్ట్.. ట్విట్టర్లో ట్రెండింగ్
Stock markets: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
న్యూ డుకాటి మాన్స్టర్ బుకింగ్స్ షురూ : ధర ఎంతంటే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

