Festive Cheers in Stocks | ఫెస్టివ్ `బుల్`.. పాజిటివ్ సంకేతాలు.. ఎం-క్యాప్ 5.57 లక్షల కోట్లు లబ్ధి
Festive Cheers in Stocks | అంతర్జాతీయ పాజిటివ్ సంకేతాలతో స్టాక్‌మార్కెట్లు పుంజుకోవడంతో ఎం-క్యాప్ రూ.5.57 లక్షల కోట్లు పెరిగింది.
Festive Cheers in Stocks | సోమవారం వాల్‌స్ట్రీట్‌లో ఓవర్‌నైట్ ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీసింది. విజయదశమికి ముందు రోజు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1277 పాయింట్లు (2.25%) లాభ పడి 58,065 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 387 (2.29%) పాయింట్ల లబ్ధితో 17,274 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.57 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.273.84 లక్షల వద్ద నిలిచింది. 20211 నుంచి అక్టోబర్ నెలలో రెండు సార్లు మాత్రమే సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. మూడో త్రైమాసికం ప్లస్ ద్వితీయార్థం ప్రారంభం కానున్న నేపథ్యంతోపాటు బుధవారం విజయదశమి సెలవు నేపథ్యంలో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
బూస్ట్ ఇచ్చిన గ్లోబల్ మార్కెట్లు
డోజోన్స్ సోమవారం ట్రేడింగ్‌లో 2.66 శాతం లాభాలతో ముగిసింది. మూడ నెలల తర్వాత డోజోన్స్ లాభాలతో ముగియడం ఇదే తొలిసారి. పండుగల నేపథ్యంలో జపాన్ నిక్కీతోపాటు ఆసియన్ మార్కెట్లు రెండు వారాల తర్వాత గరిష్ఠస్థాయికి దూసుకెళ్లాయి. చైనా, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా ట్రేడింగ్ జరుగలేదు.
బాండ్లు, డాలర్ బలహీనతలు
సమీప భవిష్యత్‌లో డాలర్, అమెరికా బాండ్లు పతనం అవుతాయన్న సంకేతాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ 112 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ 0.25% బలపడి రూ.81.67 వద్ద ముగిసింది. యూఎస్ పదేండ్ల గడువు గల బాండ్లు 0.88 శాతం తక్కువ 3619 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి.
ఎఫ్ఐఐ కొనుగోళ్ల దన్ను ఇలా
గత నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.7000 కోట్లకు పైగా విలువ గల స్టాక్స్ విక్రయించినా.. సోమవారం ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ.590 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. గత నెలలో యూఎస్ మాన్యుఫాక్చరింగ్ డేటా 28 నెలల కనిష్టానికి పడిపోయి 50.9 వద్ద స్థిర పడటం కూడా బుల్ పుంజుకోవడానికి కారణమైనట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

