Interest on FDs | ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై వడ్డీరేట్లు పెంపు.. ఇవీ డిటైల్స్!
Interest on FDs | యెస్ బ్యాంక్.. కొటక్ మహీంద్రా బ్యాంక్.. ఈ నెల 10 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించాయి.
Interest on FDs | రెండు ప్రైవేట్ బ్యాంక్‌లు కొటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్.. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించాయి. సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..!
ఇలా కొటక్ మహీంద్రా బ్యాంక్
కొటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెంచింది. 15 రోజుల నుంచి 30 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 2.65 శాతం, 31 రోజుల నుంచి 90 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.25 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 3.75 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నది. 180 రోజుల నుంచి 363 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఐదు శాతం, ఏడాది గడువు టర్మ్ డిపాజిట్‌పై 5.25, 365 నుంచి 389 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు అమలవుతుంది.
390 రోజుల నుంచి మూడేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.85 శాతం, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు గడువు గల ఎఫ్డీలపై 5.90 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
యెస్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీరేట్లు ఇలా
యెస్ బ్యాంకులో ఏడు రోజుల నుంచి 14 రోజుల గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీరేటు, 15-45 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.70 శాతం, 46 -90 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 4.10 శాతం వడ్డీరేటు లభిస్తుంది. మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపు టర్మ్ డిపాజిట్లపై 4.75 శాతం, 9 నెలల నుంచి ఏడాది లోపు ఎఫ్డీలపై 5.75 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి 18 నెలల్లోపు గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, 18 నెలల నుంచి మూడేండ్ల లోపు, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీ చెల్లిస్తుంది.
ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్‌పై పెనాల్టీ
ఫిక్స్డ్ డిపాజిట్ల ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్స్పై ఈ నెల 8 నుంచి పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు యెస్ బ్యాంక్ ప్రకటించింది. 181 రోజుల గడువు గల ఎఫ్డీలపై 0.25 నుంచి 0.50 శాతం, 182 రోజుల అంతకంటే ఎక్కువ గడువు గల టర్మ్ డిపాజిట్ల మీద 0.50 నుంచి 0.75 శాతం పెనాల్టీ వసూలు చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం పెనాల్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

