Gold Price | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.51,264 పలుకుతున్నది. శనివారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ బంగారం పది గ్రాముల ధర రూ.51,146కి చేరుకున్నది.
కిలో వెండి ధర కూడా రూ.64 వేల దిగువకు చేరింది. క్రితం ధరతో పోలిస్తే రూ.1286 తగ్గి కిలో వెండి ధర రూ.63,991 వద్ద స్థిర పడింది. ఎంసీఎక్స్‌లో సాయంత్రం నాలుగు గంటలకు రూ.64,705 పలికిందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1888.44 డాలర్లు పలికింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 23.21 డాలర్లకు చేరుకుంది. ప్రతి రోజూ బంగారం ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. మీ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. తాజా ధరలు తెలుసుకునేందుకు ఈ మెసేజ్ దోహద పడుతుంది.