Videocon loan fraud case | బాంబే హైకోర్టులో కొచ్చర్ దంపతులకు చుక్కెదురు
వీడియోకాన్ రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2వ తేదీన సాధారణ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
Videocon loan fraud case | వీడియోకాన్ రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2వ తేదీన సాధారణ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ నిందితులుగా ఉన్నారు. చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
దాంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. అదనపు గడువు కోరుతూ సీబీఐ అప్పీల్ చేసింది. దీంతో కొచ్చర్ దంపతులకు 28 వరకు రిమాండ్ పొడిగించింది. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీబీఐ అరెస్ట్ అక్రమమని పేర్కొంటూ.. చందా కొచ్చర్ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

