Finacial Risk | మీ రిస్క్ ప్రొఫైల్ తెలుసా.. ఆర్థిక ప్రణాళికల్లో దేనికెంత ప్రాధాన్యం?
ప్రతీ ఇన్వెస్టర్‌కు ఓ రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఎంతదాకా రిస్క్‌ను తీసుకోగలరన్నదానిపైనే అది ఆధారపడుతుంది. ఈ రిస్క్ ప్రొఫైల్నుబట్టి మదుపరులను స్థూలంగా మూడు రకాలు (అగ్రెసివ్, కన్జర్వేటివ్, మాడరేట్)గా అభివర్ణించవచ్చు.
- 30 నుంచి 60 ఏండ్ల వారిలో వచ్చే మార్పులేంటి?
Finacial Risk | ప్రతీ ఇన్వెస్టర్‌కు ఓ రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఎంతదాకా రిస్క్‌ను తీసుకోగలరన్నదానిపైనే అది ఆధారపడుతుంది. ఈ రిస్క్ ప్రొఫైల్నుబట్టి మదుపరులను స్థూలంగా మూడు రకాలు (అగ్రెసివ్, కన్జర్వేటివ్, మాడరేట్)గా అభివర్ణించవచ్చు. ఇందులో తొలి వర్గంవారు తమ పెట్టుబడులపై రాబడులను పెంచుకోవడానికి ఎలాంటి రిస్క్‌నైనా తీసుకుంటారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. రెండో వర్గంవారు తమ పెట్టుబడులకు ఎంతమాత్రం నష్టం వాటిల్లనివ్వరు. సురక్షిత, స్థిరమైన ఆదాయాన్నే కోరుకుంటారు. మూడో వర్గంవారు తమ పెట్టుబడుల్లో కొన్నింటిని అధిక రాబడులనిచ్చే దిశగా.. మరికొన్నింటిని సురక్షిత పెట్టుబడి సాధనాల్లోకి మళ్లిస్తారు. ఇంకా చెప్పాలంటే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూనే సేఫ్ గేమ్ ఆడుతారన్నమాట. మీ ఆలోచనా విధానాన్నిబట్టి మీరు ఏ వర్గానికి చెందుతారో మీరే తెలుసుకోండి. అయితే ఇవన్నీ కూడా వారివారి వయసుపైనే ఆధారపడి ఉంటాయని మరువద్దు.
ఇక వయసులవారీగా..
మొదటగా 30 ఏండ్ల ఇన్వెస్టర్నే పరిశీలిస్తే.. పెట్టుబడుల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే వయసు చిన్నది కాబట్టే. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీంతో ఈక్విటీలు, ఇన్సూరెన్స్ పాలసీలు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ తదితరాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను సహజంగానే పరిశీలిస్తారు. అలాగే పిల్లల చదువు, రిటైర్మెంట్ సేవింగ్స్కూ ప్రాధాన్యతనిస్తారు.
ఇక 40 ఏండ్లవారిని చూస్తే.. ఆర్థిక లక్ష్యాలన్నీ దాదాపుగా మధ్యలో ఉంటాయి. గృహ రుణాలు, పిల్లల చదువు వంటి వాటితో ఎంగైజైపోయి ఉంటారు. కొత్త పెట్టుబడులకు ఆసక్తి ఉన్నా.. ఇప్పటికే ఉన్న కమిట్మెంట్లతో ముందడుగు వేయలేరు. అయినప్పటికీ నమ్మకం కుదిరితే రిస్క్ తీసుకోవడానికీ వెనుకాడరనే చెప్పాలి. అయితే చిన్నచిన్న మొత్తాలతో పెట్టుబడులకు ప్లాన్ చేసుకుంటారు.
50 ఏండ్లవారు ఎక్కువగా రిటైర్మెంట్ సేవింగ్స్‌పైనే దృష్టి పెడుతారు. కనుక రిస్క్‌కు దూరంగానే ఉంటారు. స్థిరమైన ఆదాయం వచ్చినా లేదా తక్కువ ప్రతిఫలమే అందుతున్నా.. అసలు పెట్టుబడులు భద్రంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీ పెట్టుబడుల్లో వృద్ధి అనేది గతంలో మీరు మొదలుపెట్టిన వాటిపైనే ఆధారపడి ఉంటుంది. అంతేగానీ కొత్త పెట్టుబడులపై ఆస్కారం ఉండదనే గుర్తించాలి.
చివరగా 60 ఏండ్లు.. ప్రశాంతమైన జీవనానికి పెద్దపీట వేస్తారు కనుక ఇప్పటికే సంపాదించిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వంటి సురక్షిత పెట్టుబడి సాధనాల్లోకే తీసుకెళ్తారు. రుణాలపై ఎక్కువగా ఆసక్తి చూపరు. ఒకవేళ అప్పులకు వెళ్తే తిప్పలు తప్పవనే చెప్పాలి. పైగా బ్యాంకుల్లో ఈ ఏజ్ గ్రూప్‌వారికి రుణాలూ పుట్టవన్నది తెలిసిందే. కాబట్టి పెట్టుబడులకు ఆసక్తి ఉంటే ఈక్విటీల్లో మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలను పరిశీలించవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

