PAN-Aadhaar Link | పాన్-ఆధార్ అనుసంధానం ఆలస్యమైతే ఆర్థిక భారం తప్పదు ఇలా.. !
PAN-Aadhaar Link | పాన్-ఆధార్ కార్డు అనుసంధానం మిస్ అయిన వారు రూ.6000 జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలవారు సైతం రూ.2000 పెనాల్టీ పే చేయాల్సిందే.
PAN-Aadhaar Link | ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు.. సామాజిక, వ్యక్తిగత గుర్తింపు కార్డు ‘ఆధార్’.. ఇప్పుడు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారైనా, వేతన జీవులైనా ఆధార్, పాన్ కార్డు అత్యంత కీలకం. కనుక పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించడం తప్పనిసరి. ఆధార్’తో పాన్ కార్డు అనుసంధానానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. ఆ గడువు లోగా అనుసంధానించకుంటే సదరు ‘పాన్’ కార్డు చెల్లుబాటు కాదు.. అలా చెల్లుబాటు కానీ పాన్ కార్డుతో ఈ నెలాఖరులోగా ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయలేరు.. అయినా పాన్ కార్డును ఆధార్’తో అనుసంధానం చేయొచ్చు. అందుకు రూ.1000 ఫైన్ ముందుగా చెల్లించాలి. అలా అపరాధ రుసుము చెల్లించినా, ఈ నెలాఖరులోపు రీయాక్టివేట్ కాకుంటే సకాలంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయి.
పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం కాక.. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఇబ్బందిగా మారితే.. ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేయాల్సి వస్తుంది. అలా ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వచ్చిన వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటితే పెనాల్టీగా రూ.5000 చెల్లించాల్సి ఉంటది.
చెల్లుబాటు కానీ (Inoperative) పాన్ కార్డు రీ యాక్టివేట్ చేసుకోవడానికి రూ.1000 ఫైన్, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఆలస్యానికి రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. రెండూ కలిపితే రూ.6,000 పే చేయాల్సి ఉంటది.
వేతన జీవి, చిన్న వ్యాపారి వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నా.. పాన్ కార్డు చెల్లుబాటు కాక, ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తే రూ.1000 జరిమాన ప్లస్ పాన్ కార్డు రీయాక్టివేట్ చేసుకోవడానికి రూ.1000 పెనాల్టీ కలిపి మొత్తం రూ.2000 ఫైన్ పే చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

