ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గినా.. పన్ను ఆదా అయ్యే పొదుపు మార్గాల్లో ఇదే అన్నింటికన్నా ఆకర్షణీయం. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)కు సైతం ఇంతే వడ్డీరేటు వస్తున్నది. దీంతో పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వంటి వాటిలో ఎక్కువ వడ్డీరేటు వస్తున్నవి ఇవే ఇప్పుడు. ఇక చాలా బ్యాంకుల్లో ఎఫ్డీలపై 6 శాతం కంటే తక్కువ వడ్డీరేటునే ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు 6.5 శాతం వడ్డీరేటు వస్తున్నది. కాగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీరేటు 7.1 శాతంగా ఉన్నది. దీంతో ఉద్యోగులు, ఉద్యోగేతరులకు మిగులు నగదు పొదుపునకు ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తున్నది.