మే రికార్డు.. ఈపీఎఫ్‌వోలో కొత్తగా 9.20 లక్షల సబ్స్క్రైబర్లు!
మే రికార్డు.. ఈపీఎఫ్‌వోలో కొత్తగా 9.20 లక్షల సబ్స్క్రైబర్లు! ఈపీఎఫ్‌వోలో గత మే నెలలో 9.20 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు జత కలిశా....

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో గత మే నెలలో 9.20 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు జత కలిశారు. వీరిలో 5.73 లక్షల మంది ఖాతాదారులు చేరారు. ఇంత భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఒక నెలలో చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి రెండు నెలల్లో ఈపీఎఫ్‌వోలో చేరిన సబ్స్క్రైబర్ల సంఖ్య మొత్తం 20.20 లక్షల మందికి చేరింది.
కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్ ప్రభావం అంతగా లేదని, దీనికి తమ సంస్థలో కొత్త సబ్స్క్రైబర్లు భారీగా చేరడమే నిదర్శనం అని ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్‌వో సభ్యులకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏబీఆర్‌వై, పీఎంజీకేవై స్కీమ్‌ల మద్దతు లభించడం కూడా ఒక కారణం.
మే నెలలో 3.47 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు వైదొలిగారు. తిరిగి ఇతర సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిన సభ్యులు ఈపీఎఫ్‌వో సభ్యులు తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. మే నెలలో 22-25 ఏండ్ల మధ్య వయస్కులు సుమారు 2.39 లక్సల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. 29-35 ఏండ్ల మధ్య వయస్సు గల వారు 1.90 లక్షల మంది జత కలిశారు.
మొత్తం ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లలో మహిళలు సుమారుగా 21.77 శాతం పెరిగారు. హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 5.45 లక్షల మంది ఖాతాదారులు చేరారు. మొత్తం సభ్యుల్లో ఇది 59.29 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 20.20 లక్షల మందికి గాను, 11.83 లక్షల మంది ఉన్నారని ఈపీఎఫ్‌వో వెల్లడించింది.
మొత్తం సబ్స్క్రైబర్లలో 46.77 శాతం మంది చిన్న కాంట్రాక్టర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, మ్యాన్ పవర్ ఏజెన్సీలతో కూడిన ఎక్స్పర్ట్ సర్వీసెస్ విభాగం వారే కావడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- coivid
- EPFO
- subscribers
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

