EPFO | 8.25 శాతానికి పెరిగిన ఈపీఎఫ్ వడ్డీ రేటు
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్‌పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్‌పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది. వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే 8.25 శాతంగా ఖరారు చేసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక ఏడాది (2021-22) 8.10 శాతంగానే ఉన్నది. దీంతో గత మూడేండ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటుగా నిలిచింది.
కాగా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పెంచేందుకు బోర్డు నుంచి ఈపీఎఫ్‌వో అనుమతుల్ని కోరే వీలున్నది. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 15 శాతానికి పెంచాలన్నది ఈపీఎఫ్‌వో యోచన. దీనివల్ల పీఎఫ్ సొమ్ముపై మరింత రాబడులు అందుకోవచ్చంటున్నది. దీనిపై ట్రస్టీలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఈపీఎఫ్‌వోలో 6 కోట్లకుపైగా సభ్యులున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- CBT
- EPFO
- interest
- interest rate
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

