WazirX A/C Freeze | భారత్‌లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థల్లో పాపులర్ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్ఎక్స్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. వజీర్ఎక్స్ మాతృసంస్థ జన్‌మాయి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరి ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో సంబంధిత ఎక్స్చేంజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ.64.67 కోట్ల నిల్వలను ఫ్రీజ్ చేయాలని ఆ బ్యాంకు అధికారులను ఈడీ ఆదేశించింది.
ఫెమా చట్టం కింద క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్ఎక్స్ను ఈడీ నోటీసు జారీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పిన మరునాడే ఆ సంస్థ డైరెక్టర్ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ చేయడం గమనార్హం.భారత్‌లో పని చేస్తున్న చైనా లోన్ యాప్స్‌తో వజీర్ఎక్స్కు గల సంబంధాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. వజీర్ఎక్స్కు వ్యతిరేకంగా ఫెమా చట్టం కింద ఈడీ రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్నదని పంకజ్ చౌదరి రాతపూర్వక సమాదానంలో చెప్పారు.
థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్లు ఎఫ్‌టీఎక్స్, బినాన్స్ నుంచి వచ్చే నిధులను బదిలీ చేయడంతోపాటు క్రిప్టో కరెన్సీలుగా మార్చేస్తున్నదని వజీర్ఎక్స్పై అభియోగం. గుర్తు తెలియని వాలెట్లలోకి ఫెమా చట్టాలకు వ్యతిరేకంగా రూ.2790 కోట్ల క్రిప్టో అసెట్స్ బదిలీ చేయడానికి వజీర్ ఎక్స్ అనుమతించిందని ఈడీ మరో అభియోగం మోపింది.