EPF | ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఓ ప్రభుత్వ పథకం. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఉద్దేశించినది. ఉద్యోగాలు మారుతున్నప్పుడు.. ప్రస్తుత సంస్థ నుంచి కొత్త సంస్థకు మన ఈపీఎఫ్‌ను బదిలీ కూడా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం వీడిన తర్వాత మీ ఈపీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే తప్పక రెండు నెలలు వేచి ఉండాల్సిందే. కాగా, నిబంధనల ప్రకారం ఈ సమయంలో నెల రోజులపాటు నిరుద్యోగులుగా ఉంటే వారి ఈపీఎఫ్ సొమ్ములో 75 శాతం, రెండు నెలలు ఉద్యోగం దొరక్కపోతే మిగతా ఆ 25 శాతం సొమ్మునూ ఉపసంహరించుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్.. మీ ఉద్యోగ కాలం, ఇతరత్రా ఆదాయ వనరుల ఆధారంగా వర్తించే పన్నులకు లోబడి ఉంటాయి.
ఐదేండ్లు కాకముందే మీ పీఎఫ్ ఖాతా నుంచి సొమ్మును తీసుకోవాలనుకుంటే పన్నులు వర్తిస్తాయి. అలా కాకుండా ఫామ్ 31 ద్వారా మీ పాత సంస్థ నుంచి కొత్త సంస్థలోకి ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకుంటే కొంత కాలం తర్వాత సీనియారిటీ పెరిగి పన్నుల నుంచి తప్పించుకోవచ్చు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలతో మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జత చేసుకుంటే ఆన్లైన్ విత్‌డ్రాయల్స్ సులభతరంగా ఉంటాయి.