ElonMusk Starlink | రూ.7,350లకే స్టార్‌లింక్ కనెక్షన్! ఆ టెల్కోలతో టైఅప్?!
ElonMusk Starlink | ఎలన్‌మస్క్ స్టార్‌లింక్.. శాటిలైట్బ్రాడ్బాండ్ సేవలందించడానికి దేశీయ టెల్కోలతో సహకార ఒప్పందాలకు ప్రయత్నిస్తోంది

ElonMusk Starlink | దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగిడాలని టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. స్పేస్ ఎక్స్ శాటిలైట్ బ్రాడ్ బాండ్ సంస్థ స్టార్‌లింక్ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం దేశీయ టెలికం సంస్థల సహకారం తీసుకోవాలని భావిస్తున్నది.
టెలికం కంపెనీలతో సహకార ఒప్పందాలు చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించామని స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ సంజయ్ భార్గవ శుక్రవారం పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. తొలి దశలో 12 జిల్లాలకు బ్రాడ్‌బాండ్ సేవలను విస్తరించాలని స్టార్ లింక్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు విస్తరించాల్సిన జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించిందని సంజయ్ భార్గవ తెలిపారు. ఇందుకోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్)తోపాటు వివిధ సంస్థలకు గల ఆసక్తిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో ఇప్పటికే 5,000లకు పైగా ప్రీ ఆర్డర్లు తమకు వచ్చాయని స్టార్‌లింక్ పేర్కొంది.
ఒక్కో కస్టమర్ నుంచి 99 డాలర్లు లేదా రూ.7,350 డిపాజిట్ తీసుకుంటామని స్టార్‌లింక్ తెలిపింది. సెకన్‌కు 50-150 మెగాబైట్స్ డేటా స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందించనున్నది. ఇంతకుముందు 10 గ్రామీణ లోక్‌సభ స్థానాలకు స్టార్‌లింక్ టర్మినల్స్ ద్వారా 80 శాతం ఇంటర్నెట్ సర్వీసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టార్‌లింక్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

