Halloween | ఐదేళ్ల వయసులో మస్క్ ఇలా.. ఫొటో షేర్ చేసిన ట్విట్టర్ బాస్
Halloween | హాలోవీన్ (Halloween) పండుగ సందర్భంగా ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఓ ఫొటో షేర్ చేశారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్ డ్రెస్ ధరించిన (Dressed As Santa Claus) ఫొటోను మస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ మేరకు అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు తెలిపారు.
Halloween | హాలోవీన్ (Halloween) పండుగ.. దీని గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఇది విదేశాలకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా బాగా విస్తరించింది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరోజు దెయ్యాలు, భూతాల్లా రెడీ అయ్యి అందరినీ భయపెడుతుంటారు. కాగా, తాజాగా హాలోవీన్ సందర్భంగా టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్ డ్రెస్ ధరించిన (Dressed As Santa Claus) ఫొటోను మస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ మేరకు అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని.. ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్ సహా పలు దేశాల్లో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
👻🎃 Happy Halloween 🎃👻
[me dressed as Santa age 5] pic.twitter.com/YEViI8G46D— Elon Musk (@elonmusk) October 31, 2023
Also Read..
Infosys | ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే
Malayala Actor Priya | 8 నెలల గర్భిణి.. గుండెపోటుతో ప్రముఖ నటి మృతి
Road Accidents | గతంతో పోలిస్తే 12 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అతివేగం కారణంగానే అధికం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

