X TV App | ఎక్స్ టీవీ యాప్‌ను తీసుకురాబోతున్న ఎలాన్ మస్క్..! యూట్యూబ్‌కి పోటీగా..!
X TV App | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శనివారం కీలక ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్ టీవీ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చిన విషయం తెలిసిందే. అమెజాన్, శాంసంగ్ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా ఈ యాప్‌ను లాంచ్ చేయబోతున్నట్లుగా మస్క్ వెల్లడించారు.
X TV App | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శనివారం కీలక ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్ టీవీ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చిన విషయం తెలిసిందే. అమెజాన్, శాంసంగ్ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా ఈ యాప్‌ను లాంచ్ చేయబోతున్నట్లుగా మస్క్ వెల్లడించారు. ఓ సోషల్‌మీడియా యాజర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఎలాన్ మస్క్ టీవీ యాప్ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నది. ఎలాన్ మస్క్ తీసుకురాబోయే ఎక్స్ టీవీ యాప్ య్యూటూబ్తో పోటీ పడనుందని భావిస్తున్నారు. ఎక్స్ టీవీ యాప్ వచ్చేవారం విడుదలవనున్నది. ఈ యాప్ యూట్యూబ్‌ను పోలి ఉండనున్నది. ఎలోన్ మస్క్ ఎక్స్ యాప్‌కు చెందిన వీడియోలను టీవీ యాప్ ద్వారా టీవీకి పంపాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సమూలంగా మార్పులను చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్‌ను ఎక్స్‌గా మార్చారు. అలాగే, ఎక్స్‌ను ప్రస్తుతం ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫోన్ నంబర్‌తో సంబంధం లేకుండా ఎక్స్ నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
కొద్దిరోజుల కింద న్యూస్ ఛానెల్‌కు చెందిన ప్రముఖ యాంకర్‌తో ఒప్పందం చేసుకున్నారు. యూట్యూబ్‌కి పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ టీవీ యాప్‌ను విడుదల చేయనుండగా.. అయితే, తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి రానున్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్మార్ట్ డివైజెస్‌లో యూట్యూబ్ డిఫాల్ట్‌గా వస్తున్నది. మార్కెట్లోకి ఎన్నో యాప్స్ వచ్చినా.. టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది.
Coming soon https://t.co/JlnlSL7eS9
— Elon Musk (@elonmusk) March 9, 2024
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

