El Salvedor to Bit Coin City | క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ పట్ల యువత.. మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీపై నియంత్రణకు ప్రపంచదేశాలు కసరత్తు చేస్తుంటే.. ఒక దేశం ఏకంగా బిట్ కాయిన్ సిటీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. ఆ దేశం ఎల్ సాల్వెడార్. ప్రపంచంలోనే తొలిసారి ఈ దేశం బిట్ కాయిన్‌కు చట్టబద్ధత తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిట్ కాయిన్ సిటీ నిర్మాణానికి ఎల్ సాల్వెడార్ బాండ్లు జారీ చేయనున్నది. బిట్ కాయిన్‌పై ప్రస్తుతం అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
బిట్ కాయిన్ల కోసం అగ్ని పర్వతం నుంచి ఇంధనం సరఫరా చేస్తున్నట్లు ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయిబ్ బుక్లే ఓ కార్యక్రమంలో తెలిపారు. 2022లో ఈ బిట్ కాయిన్ బాండ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. తాము నిర్మించనున్న బిట్ కాయిన్ సిటీలో వ్యాట్ మినహా ఏ పన్ను కూడా తమ ప్రభుత్వం విధించబోదన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రొవైడర్ బ్లాక్‌స్ట్రీమ్ చీఫ్ స్ట్రాటర్జీ అధికారి శ్యామ్సన్ మోవ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం బిట్ కాయిన్ మద్దతుతో ఒక బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేస్తుందన్నారు.