Ebay Layoffs | లేఆఫ్స్ ఆగవా..? కొత్తగా ఈబేలో వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన..!
Ebay Layoffs | ఈ ఏడాది సైతం ప్రముఖ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గతేడాది పెద్ద సంఖ్యలో టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గూగుల్, అమెజాన్, జిరాక్స్ సహా అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో మరో కంపెనీ సైతం చేరింది.
Ebay Layoffs | ఈ ఏడాది సైతం ప్రముఖ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గతేడాది పెద్ద సంఖ్యలో టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గూగుల్, అమెజాన్, జిరాక్స్ సహా అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో మరో కంపెనీ సైతం చేరింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే. ఈ కంపెనీ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నది.
ఈ మేరకు కంపెనీ పూర్తికాల శ్రామికశక్తిలో తొమ్మిది శాతం ఉంటుందని.. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ పేర్కొంది. తేలికగా తీసుకునే చర్య కాదని.. ఇది ఈ-బయ్యర్స్పై ప్రభావం చూపుతుందని తెలుసునని చెప్పింది. ఈబే కమ్యూనిటీ, సంస్కృతికి కీలకమైన సహకారాన్ని అందించిన వ్యక్తులకు తప్పక వీడ్కోలు పలకక తప్పడం లేదని.. ఇదేం అంత సులభం కాదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థతో పాటు మార్కెట్ సవాళ్లతో కూడుకొని ఉన్నదని.. ఈ క్రమంలో వ్యయ పరిమితిపై దృష్టి పెట్టడం అవసరమని భావించామని కంపెనీ తెలిపింది.
వ్యూహానికి వ్యతిరేకంగా, లక్ష్యానికి దూరంగా వెళ్తున్నామని.. ఉద్యోగుల సంఖ్య, ఖర్చులు వ్యాపారం వృద్ధిని అధిగమించాయని.. దీన్ని పరిష్కరించేందుకు ఎండ్-టు-ఎండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నట్లు వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

