Shock for Tata&Adani | ఆదిలోనే టాటా.. ఆదానీలకు హంసపాదు.. కేంద్రం వ్యతిరేకమా?!
Shock for Tata&Adani | ఆన్లైన్ మార్కెటింగ్‌లో టాటా సన్స్, ఆదానీ గ్రూప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వనున్నదా.. అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా ....

Shock for Tata&Adani | ఆన్లైన్ మార్కెటింగ్‌లో టాటా సన్స్, ఆదానీ గ్రూప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వనున్నదా.. అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు, సేవలను ఒకే ప్లాట్‌ఫామ్ కింద ప్రజలకు అందుబాటులోకి తేవడానికి టాటా సన్స్, ఆదానీ గ్రూప్ వేర్వేరు సూపర్ యాప్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కానీ ఆన్లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్‌పై కేంద్రం రూపొందించిన ముసాయిదా నిబంధనలు మాత్రం ఈ రెండు సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
టాటా, ఆదానీలకు శరఘాతమేనా?
ఆ నిబంధన సూపర్ యాప్ ప్లాట్ఫామ్లోకి సంబంధిత సంస్థ అనుబంధ సంస్థల వస్తువులు, సేవలను నిషేధిస్తున్నది. ఆన్లైన్ మార్కెటింగ్‌లో టాటా, ఆదానీ తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ తరుణంలో కేంద్రం రూపొందించిన ముసాయిదా వాటికి అడ్డం పడుతున్నది. దీని ప్రకారం టాటా రూపొందిస్తున్న సూపర్ యాప్ పరిధిలోకి టైటాన్, తాజ్, తనిష్క్, టీసీఎస్ తదితర టాటా సన్స్ గ్రూప్ సంస్థల వస్తువులు, సేవలు అనుమతించరు. టాటా ఇటీవల స్వాధీనం చేసుకున్న బిగ్ బాస్కెట్ కూడా ఈ సూపర్ యాప్ పరిధిలోకి రాదు. ఇప్పటికే కీలక వాటాదారులు, ఉద్యోగులతో సూపర్ యాప్‌ను పరీక్షిస్తున్నది.
తుది నిబంధనలు నిషేధిస్తే ఇలా ప్రత్యామ్నాయం
ఇదే పరిస్థితి ఆదానీ గ్రూప్‌ది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్, ఆదానీ ట్రాన్స్మిషన్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్, ఆదానీ పోర్ట్స్ సేవలను ఆదానీ గ్రూప్ రూపొందిస్తున్న సూపర్ యాప్ పరిధిలోకి తేవడం కుదరదు. ఇక జియోమార్ట్ ప్లాట్ఫామ్లోకి హమ్లేస్ ఉత్పత్తులు తీసుకు రాకూడదు. అయితే, తుది నిబంధనలు ఒకే గ్రూప్ సంస్థల ఉత్పత్తులను, సేవలను నిషేధిస్తే.. వాటి కోసం సొంతంగా కార్పొరేట్ సంస్థలు యాప్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
సూపర్ యాప్‌లంటే..
తొలుత సూపర్ యాప్‌ల కల్చర్ చైనాలో మొదలైంది. ఒక మొబైల్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో అన్ని రకాల సేవలు చేరుస్తారు. క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో టేక్ఎవే ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఒక హోటల్ బుకింగ్, సినిమా టిక్కెట్ల కొనుగోలు, బీమా పాలసీ కొనుగోలు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఫైనాన్సియల్ మార్కెట్లలో ట్రేడింగ్ తదితర సర్వీసులన్నీ ఈ సూపర్ యాప్‌లోనే సాగుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

