నిరాశపర్చిన రెడ్డీస్

- నికర లాభం రూ. 570 కోట్లు
- అమ్మకాలు రూ. 4,919 కోట్లు
కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా అమ్మకాల్లో వృద్ధి సాధించాం. గ్లోబల్ జెనరిక్స్ ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, డాలర్-రూపాయి విలువ ప్రతికూలత కారణంగా లాభాలు పెరగలేదు.
–జీవీ ప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్, ఎండీ
హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరెటరీస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాపూరిత ఫలితాల్ని వెల్లడించింది. మంగళవారం వెల్లడైన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను ఏమాత్రం చేరలేకపోయాయి. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గతేడాది ఇదేకాలంతో పోలిస్తే స్వల్ప తగ్గుదలతో రూ.570.8 కోట్లుగా నమోదయ్యింది. 2020 జూన్ త్రైమాసికంలో ఇది రూ. 579 కోట్లు. కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 4,417 కోట్ల నుంచి రూ. 4,919 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజ్ కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ నుంచి రూ. 660 కోట్ల నికరలాభాన్ని, రూ. 5,120 కోట్ల ఆదాయాన్ని అంచనావేసాయి. లాభంలో వృద్ధిలేకపోవడానికి కారణాల్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ వివరిస్తూ ఉత్తర అమెరికాలో ఔషధ ధరలు తగ్గడం ఒక కారణంకాగా, వర్థమాన మార్కెట్లలోనూ, ఇండియాలోనూ కొన్ని బ్రాండ్లపై పెట్టుబడులు చేయడం మరో కారణమని వివరించారు. ఈ పెట్టుబడులతో రానున్న త్రైమాసికాల్లో అమ్మకాలు పెరుగుతాయని తాము అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఫలితాల ప్రధానాంశాలు….
- భారత్‌లో ఆదాయం 69 శాతం వృద్ధితో రూ. 1,060 కోట్లకు చేరిక. సెకండ్‌వేవ్‌తో కొవిడ్ ఔషధ విక్రయాల్లో భారీ పెరుగుదల.
- ఉత్తర అమెరికా అమ్మకాల్లో 1 శాతం క్షీణత. యూరప్ వ్యాపారంలో 1 శాతం వృద్ధి
- 2021 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఇబిటా 30 శాతం డౌన్
- మార్చి క్వార్టర్లో 22.1 శాతంగా వున్న లాభాల మార్జిన్, జూన్ త్రైమాసికంలో 14.9 శాతానికి క్షీణత
లంచాలిచ్చినట్లు కంపెనీపై ఫిర్యాదు
- అమెరికా సెక్ నుంచి నోటీసు
ఉక్రెయిన్, ఇతర సీఐఎస్ దేశాల్లో తాము, తమ కంపెనీ తరపున లంచాలు ఇచ్చినట్లు ఫిర్యాదు నమోదయ్యిందని, ఈ అంశంపై సవివర దర్యాప్తు జరుపుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఇది (లంచాలివ్వడం) అమెరికా అవినీతి నిరోధక చట్టాల ఉల్లంఘన అయినందున కంపెనీ డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆదేశాల మేరకు ఒక అమెరికా లా కంపెనీ దర్యాప్తు జరుపుతున్నదని డాక్టర్ రెడ్డీస్ వివరించింది. అలాగే కొన్ని సీఐఎస్ దేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలంటూ అమెరికా సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (సెక్) నుంచి జూలై 6న ‘సబ్పొయినా’ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఈ అంశం కారణంగా అమెరికాలోనూ, ఇతర విదేశాల్లోనూ కంపెనీపై ప్రభుత్వ చర్యలకు ఆస్కారం ఉంటుందని, సంబంధిత చట్టాలకు అనుగుణంగా సివిల్, క్రిమినల్ చర్యలకు దారితీయవచ్చని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. కంపెనీ నిరాశాజనక ఫలితాలకు తోడు, ఈ ఫిర్యాదు, తదుపరి పరిణామాలు వెల్లడైన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేరు మంగళవారం స్టాక్ ఎక్సేంజీల్లో 10 శాతంపైగా పతనమయ్యింది. అమెరికా ఎక్సేంజీల్లో సైతం లిస్టెడ్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్ సైతం 10 శాతం క్షీణించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

