రెండోరోజూ అదే జోరు
- భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం
ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభపడటం సూచీల్లో జోష్ పెంచింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 462.26 పాయింట్లు లాభపడి 52,727.98 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 644 పాయింట్లు లాభపడి 52,909.87 వద్దకు చేరుకున్న సూచీ చివరకు ఇంతటి స్థాయి లాభాలను నిలుపుకోలేకపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 142.60 పాయింట్లు అందుకొని 15,699.25 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీలు రెండు శాతానికి పైగా అధికమయ్యాయి.
5 లక్షల కోట్లు పెరిగిన సంపద
మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 905 పాయింట్లు ఎగబాకింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,06,975.56 కోట్లు పెరిగి రూ.2,42,27, 901.56 కోట్లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ కారణంగా దేశీయ సూచీలు పరుగు పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
- మహీంద్రా అండ్ మహీంద్రా 4.28 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా స్టీల్, నెస్లె, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- మరోవైపు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, విప్రో, సన్‌ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు మాత్రం నష్టపోయాయి.
- బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.60 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.53 శాతం చొప్పున అధికమయ్యాయి.
- రంగాలవారీగా చూస్తే టెలికం 2.53 శాతం, వాహన 1.98 శాతం, పవర్ 1.73 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.47 శాతం, ఫైనాన్స్ 1.40 శాతం లాభపడ్డాయి. కానీ, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు పతనం చెందాయి.
- 2,401 షేర్లు లాభపడగా, 906 షేర్లు పతనమయ్యాయి. 141 షేర్లు యథాతథంగా ముగిశాయి.
- మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 1,367 పాయింట్లు(2.66 శాతం), నిఫ్టీ 405.75 పాయింట్లు(2.64 శాతం) పెరిగాయి.
- డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక్క పైసా తగ్గి చారిత్రక కనిష్ఠ స్థాయి 78.33 వద్ద ముగిసింది.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 1.11 శాతం పెరిగి 111.27 డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

