న్యూఢిల్లీ, ఆగస్టు 18: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశీయ ఫ్యాషన్ రిటైలర్ అన్లిమిటెడ్ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ల గడువును ఈ నెల 20 వరకు పొడగించింది.
ఇండిపెండెన్స్ డే డబుల్ ఆఫర్ కింద ఒకటి కొంటే మరోకటి ఉచితం, రూ.3 వేల విలువైన దుస్తులను కొనుగోలు చేసిన వారికి మరో రూ.3 వేల షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ ఆఫర్ కాలపరిమితిని పెంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.