జీరో కాస్ట్ ఈఎంఐతో మేలెంత? అది ఓ జిమ్మిక్కేనా..?
గృహోపకరణాల కొనుగోలులో జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను చూస్తూనే ఉంటాం. వడ్డీలేని రుణంతో వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. దీంతో అంతా దీనికి ఎగబడిపోవడం సహజమే. కానీ ధరలోనే వడ్డీ మొత్తాన్ని
గృహోపకరణాల కొనుగోలులో జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను చూస్తూనే ఉంటాం. వడ్డీలేని రుణంతో వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. దీంతో అంతా దీనికి ఎగబడిపోవడం సహజమే. కానీ ధరలోనే వడ్డీ మొత్తాన్ని కూడా కలిపేసి అమ్ముతారన్న నిజం తెలియదు. అసలుతో వడ్డీని కలిపి రుణ కాలపరిమితికి తగ్గట్టుగా ఈఎంఐలను నిర్ణయిస్తారు. అసలు జీరో వడ్డీ రుణాలే లేవని ఆర్బీఐనే చెప్పడం గమనార్హం. వడ్డీ మొత్తాన్ని కూడా ఉత్పత్తి ధరలో కలిపి అమ్మడమే జీరో కాస్ట్ ఈఎంఐ పథకాల జిమ్మిక్కు అని ఓ సర్క్యులర్లో స్పష్టం చేసింది.
ఉదాహరణకు ఒక ఉత్పత్తి ధర లక్ష రూపాయలు ఉందనుకుందాం. దీన్ని మీరు మొత్తం నగదు చెల్లించి కొనుగోలు చేస్తే డీలర్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తాడు. కానీ దాన్నే ఈఎంఐలో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ ఉండదు. సదరు డిస్కౌంట్ మొత్తాన్ని వడ్డీకి సమానంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ నియమ నిబంధనలను చదువకుండా ఓ నిర్ణయానికి రాకండి. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ చార్జీలు, కాలపరిమితి ఇవన్నీ పరిశీలించండి. నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేసే ముందు వివిధ డీలర్ల వద్ద ధరలను పోల్చి చూడండి. అలాగే నేరుగా నగదుతో కొనుగోలు చేయడానికి, ఈఎంఐలతో కొనుగోలు చేయడానికి మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్నీ పరిశీలించండి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- emi
- home appliances
- loan
- Zero cost
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

